TG LAWCET 2024 Updates : 'లాసెట్' అభ్యర్థులకు అలర్ట్.. కౌన్సెలింగ్‌ షెడ్యూల్ లో మార్పులు, కొత్త తేదీలివే

P Madhav Kumar


TG LAWCET 2024 Counselling : టీజీ లాసెట్ - 2024 కౌన్సెలింగ్ కు సంబంధించి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ గడువును ఆగస్టు 24వ తేదీ వరకు పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ లో కూడా పలు మార్పులు చేశారు. ఆగస్టు 31వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఉంటుందని ప్రకటించారు.

తెలంగాణ లాసెట్ ప్రవేశాలు 2024
తెలంగాణ లాసెట్ ప్రవేశాలు 2024

తెలంగాణ లాసెట్‌ 2024 ప్రవేశాలకు సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేశారు. కౌన్సెలింగ్ షెడ్యూల్ లో పలు మార్పులు చేశారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… ఆగస్టు 20వ తేదీతోనే ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంటుంది. అయితే ఈ గడువును ఆగస్టు 24వ తేదీ వరకు పొడిగించారు. పీజీఎల్ సెట్ అభ్యర్థులు మాత్రం ఆగస్టు 30వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది.

ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 24వ తేదీతో ముగియనుంది. రిజిస్ట్రేషన్ల కోసం రూ. 800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్సీ, దివ్యాంగ అభ్యర్థులు మాత్రం రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఆగస్టు 27వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. 28వ తేదీతో ఈ గడువు పూర్తి అవుతుంది. ఆగస్టు 29వ తేదీన వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకోవచ్చు. ఆగస్టు 31వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది.

సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 2 నుంచి 6వ తేదీలోపు ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చు. రెండో విడత కౌన్సెలింగ్ తేదీలు త్వరలోనే ఖరారు కానున్నాయి.

ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి:

  • తెలంగాణ లాసెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు మొదటగా https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • Download Rank Card అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • Hall Ticket Number, పుట్టిన తేదీని ఎంట్రీ చేయాలి.
  • -గెట్ రిజల్ట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ స్కోర్ తో పాటు ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ర్యాంక్ కార్డు కాపీని పొందవచ్చు.
  • అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు అత్యంత కీలకం.

2024-2025 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని లా కాలేజీల్లో మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సుల్లో ప్రవేశాలకు ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) TS LAWCET/ TS PGLCET-2024 ను నిర్వహించింది. ఈ ఏడాదికి సంబంధించి జూన్ 3వ తేదీన టీఎస్ లాసెట్ పరీక్షలను నిర్వహించారు. ఉద‌యం 9 నుంచి 10.30 వ‌ర‌కు మొదటి సెషన్ జరిగింది. ఇక మ‌ధ్యాహ్నం 12.30 నుంచి 2 గంట‌ల వ‌ర‌కు రెండో సెషన్, సాయంత్రం 4 నుంచి 5.30 గంట‌ల వ‌ర‌కు మూడో సెషన్ పరీక్షను నిర్వహించారు. గతేడాదితో పోల్చితే ఈసారి లాసెట్ కు ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి.

ఈ ఏడాది జరిగిన తెలంగాణ లాసెట్ పరీక్షకు 40,268 మంది హాజరయ్యారు. వీరిలో 29,258 మంది అర్హత సాధించారు. మొత్తంగా 72.66 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణులు అయ్యారు. పరీక్ష రాసిన అభ్యర్థులు https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు.

HT Telugu ఫేస్‌బుక్ పేజీ ద్వారా అప్‌డేట్స్ పొందండి
Tags
f