(2 / 6)
ఇక ఇవాళ(ఆగస్టు 17) ఏపీలో చూస్తే శ్రీకాకుళం,విజయనగరం,పార్వతీపురంమన్యం, అల్లూరి , విశాఖపట్నం,అనకాపల్లి,కాకినాడ,కోనసీమ,తూర్పుగోదావరి, ఏలూరు,అనంతపురం,శ్రీ సత్యసాయి,వైయస్ఆర్, అన్నమయ్య,చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(3 / 6)
•పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు మరియు నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
(4 / 6)
ద్రోణి ప్రస్తుతం రాయలసీమ నుంచి కొమెురిన్ ప్రాంతం వరకు విస్తరించి సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతుందని వాతావరణ సంస్థ అంచనా వేసింది. ఈ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని మంగళవారం విడుదల చేసిన బులెటిన్ లో పేర్కొంది.
(5 / 6)
ఇవాళ హైదరాబాద్ లో వాతారణం చూస్తే నగరంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఉపరితల గాలులు వాయువ్య లేదా పశ్చిమ దిశలో గంటకు 06 -10 కిమీ వేగంతో వీచే అవకాశం ఉంది.
L(6 / 6)
ఇక తెలంగాణలో చూస్తే నాలుగైదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని పేర్కొంది.
ఇతర గ్యాలరీలు
