*మలయాళ రాజ్యంలో.. వికసించిన పాలమూరు భక్తి పరిమళం..*
కేరళ రాష్ట్రం చెంగనూర్ రైల్వే స్టేషన్ సమీపంలో.. *విశ్వహింధూ పరిషత్* అధ్వర్యంలో నిర్వహిస్తున్న..*అయ్యప్ప సేవా కేంద్రం* అయ్యప్ప మాలధారుల పట్ల వరంలా మారింది.. ఒకప్పుడు రోజు కొన్ని వేల మంది అయ్యప్ప భక్తులు ప్రయాణంలో బాగంగా కేరళ రాష్ట్రం చెంగనూరు కి చేరుకునేవారు.. కానీ ఇక్క డి ప్రభుత్వం అయ్యప్ప స్వామి లకు ఎలాంటి వసతులు ఏర్పాటు చేయకుండ నిర్లక్ష్య వైకరితో వ్యవహారిస్తున్న సందర్భం లో *ఆర్ఎస్ఎస్ విశ్వహింధూ పరిషత్ సంఘం* వారు మన అయ్యప్ప భక్తులకు హిందువులకు ఎలాంటి అసౌకర్యo కలగకుండా కోట్ల రూపాలు వెచ్చించి సకల సౌకర్యాలతో అయ్యప్ప సేవా కేంద్రం *18 వసతి కేంద్రాలు* ఏర్పాటు చేయడం జరిగింది.. ఇలాంటి గొప్ప సౌకర్యాలు కల్పించడం అనేది యావత్ అయ్యప్ప భక్తులకు ఓ గొప్ప వరం..
ఈ అయ్యప్ప దర్శనంలోభగంగా పాలమురికి చెందిన *జై శబరీషా భక్తబృందం కొత్తగoజ్ శ్రీ శ్రీ జనార్దన్ గురుస్వామి* అధ్వర్యంలో చెంగనూర్ కి చేరుకున్న తరువాత VHP సంఘం అధ్వర్యంలో నిర్వహిస్తున్న అయ్యప్ప సేవా కేంద్రానికి వెళ్ళడం జరిగింది.అక్కడ సకల సౌకార్యాలతో వసతుల ఏర్పట్లు చూసి జై శబరీషా భక్తబృందం సభ్యులు ఎంత సంతోషం వ్యక్తo చేయడo జరిగింది.తదనoతరం శ్రీ జనార్దన్ గురుస్వామి అధ్వర్యంలో నిర్వహిస్తున జై శబరీశా భక్తబృందం సభ్యులు అందరు అయ్యప్ప సేవా కేంద్రంలోని పూజా కార్యక్రమాలు మరియు సేవా కార్యక్రమలలో పాల్గోనడం జరిగింది. మన పాలమూరు అయ్యప్ప భక్తుల పూజా విధానం,భజన మరియు సేవా కార్యక్రమలు చూసి ఆనందానికి లోనైన VHP అయ్యప్ప సేవా కేంద్రం సభ్యులు నేటి కాలంలో కూడా ఇలాంటి సేవ మరి భక్తి భావం కల్గిన వారిని చూడటం అరుదు అని భావించి 126 మంది సభ్యుల సమూహాన్ని ఎంతో శ్రద్ధతో భక్తితో నిబద్ధతతో నడిపిస్తున్న జనార్ధన్ గురుస్వామి గారిని కేరళ రాష్ట్రం VHP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన *అనిల్ విల్లయిల్* గారు స్వయంగా కలిసి గురుస్వామి గారిని ఏంతో ఘనంగా సన్మానించి గురుస్వామి గారితో భోజనం చెయ్యడం జరిగింది.
ఏలాంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా సేవలందిస్తున్న VHP వారి సేవా భావాన్ని చూసి మన వంతు కూడా ఆ సేవలో భాగం కావాలని ఆలోచించి *జై శబరీషా భక్తబృందం తరుపున రూ.10116/- మరియూ భక్తబృందం సభ్యుల వ్యతిగత విరాళాలు రూ.30000/- మొత్తం దాదాపు 40000/-రూపాయలు* VHP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ విల్లయిల్ గారి చేతుల మీదుగా అయ్యప్ప సేవా కేంద్రం విరాలాల నిధికి అందజేయడం జరిగింది. ఈ సందర్భముగా అనిల్ విల్లయిల్ గారు మాట్లాడుతు ఇంతటి సేవా,భక్తి భావము కలిగిన గురుస్వాములు, అయ్యప్ప స్వాములు సనాతన హిందూ ధర్మ రక్షణ మరియు శబరిమల అయ్యప్ప స్వామి యొక్క విశిష్టతను కాపాడటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
*🙏స్వామి శరణం.... స్వామియే శరణమయ్యప్ప 🙏*