Tirumala : తిరుమల శ్రీవారి భక్తులను టీటీడీ అలర్ట్ చేసింది. అలిపిరి కాలినడకన వెళ్లే భక్తులను గుంపులుగా పంపిస్తున్నారు. చిరుత సంచారం నేపథ్యంలో భక్తులను గుంపులు, గుంపులుగా పంపిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Tirumala : తిరుమల శ్రీవారి భక్తులను టీటీడీ అలర్ట్ చేసింది. కలియుగ దైవాన్ని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు అలిపిరి కాలినడక మార్గంలో తిరుమలకు చేరుకుంటారు. అయితే గత కొంత కాలంగా కాలినడక మార్గంలో చిరుతల సంచారంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. చిరుత సంచారాన్ని గుర్తించిన టీడీటీ, ఫారెస్ట్ అధికారులు నడక మార్గంలో వెళ్లే భక్తులకు కీలక సూచనలు చేశారు. చిరుతల సంచారం నేపథ్యంలో టీటీడీ అధికారులు పటిష్ఠ భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.
అలిపిరి నడక మార్గంలో
అలిపిరి నుంచి నడక మార్గంలో శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులను గుంపులు, గుంపులుగా పంపుతున్నారు. టీటీడీ అధికారులు సూచనల మేరకు భక్తులను గంపులుగా పంపుతున్నట్లు సిబ్బంది తెలిపారు. అలిపిరి నుంచి తిరుమలకు నడక మార్గంలో వెళ్లే భక్తులను ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు యథావిధిగా అనుమతిస్తున్నారు.
భక్తులను గుంపులుగా పంపుతున్న సిబ్బంది
మధ్యాహ్నం 2 గంటల దాటిన తరువాత భక్తులను గుంపులు, గుంపులుగా పంపిస్తున్నారు. ఒక్కో గ్రూపునకు 70 నుంచి 100 మంది భక్తులు ఉండేలా టీడీడీ విజిలెన్స్ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. అలాగే మధ్యాహ్నం రెండు గంటలు దాటిన తరువాత కాలినడక మార్గంలో 12 సంవత్సరాలలోపు పిల్లలకు నో ఎంట్రీ అని టీడీడీ ఇప్పటికే ప్రకటించింది. అలాగే రాత్రి 9.30 గంటల తరువాత అలిపిరి నడక మార్గాన్ని మూసివేస్తారు. చిరుత సంచారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది.
అలిపిరి నడక మార్గంలోని 7వ మైలు వద్ద చిరుత సంచారించినట్లు అటవీ సిబ్బంది గుర్తించారు. చిరుతను పలువురు భక్తుల చూసి భయాందోళన గురయ్యారు. దీంతో టీటీడీ సెక్యూరిటీ, అటవీ శాఖ సిబ్బందిని అప్రమత్తం చేసింది.
అలిపిరి 7వ మైలు వద్ద
అలిపిరి నడక మార్గంలోని 7వ మైలు వద్ద చిరుత సంచారించినట్లు అటవీ సిబ్బంది గుర్తించారు. చిరుతను పలువురు భక్తుల చూసి భయాందోళన గురయ్యారు. దీంతో టీటీడీ సెక్యూరిటీ, అటవీ శాఖ సిబ్బందిని అప్రమత్తం చేసింది.
భక్తులను గుంపులు గుంపులుగా అనుమతిస్తున్నారు. నకడమార్గంలో 7వ మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు భద్రతను కట్టుదిట్టం చేశారు. నడక మార్గం ఇరువైపులా ముళ్లపొదలను తొలగించి, లైటింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. అలాగే టీటీడీ విజిలెన్స్, ఫారెస్ట్ అధికారులు నిరంతర గస్తీ నిర్వహిస్తున్నారు. అలాగే భక్తుల స్వీయ రక్షణ కోసం కర్రలను అందిస్తున్నారు. అయితే కొందరు భక్తులు కర్రలు లేకుండానే కొండ ఎక్కుతూ సాహసం చేస్తున్నారు. మెట్ల మార్గం పైకి క్రూర మృగాలు, చిరుతలు రాకుండా భక్తులు గోవింద నామ స్మరణతో నడక యాత్ర చేయాలని టీటీడీ సూచిస్తుంది.
నడక మార్గంలో చిరుతల సంచారంతో భక్తులకు ఇబ్బంది కలగకుండా టీటీడీ అటవీశాఖతో సమన్వయం చేస్తుంది. ఈ మేరకు వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ సైంటిస్ట్ బృందం ఇప్పటికే క్షేత్రస్థాయి పరిశీలన చేసి పలు ముఖ్యమైన సిఫార్సులు చేసింది. ఎండల తీవ్రత పెరగడం నీటి జాడకోసం క్రూరమృగాలు సంచరిస్తుంటాయని అటవీ శాఖ అధికారులు అంటున్నారు.