Delhi stampede : న్యూదిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట.. 16మంది మృతి- అసలేం జరిగింది?

P Madhav Kumar


Delhi stampede : న్యూదిల్లీ రైల్వే స్టేషన్​లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 16మంది మృతిచెందారు. వీరిలో ఇద్దరు చిన్నారులు సైతం ఉన్నారు. ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు.

న్యూదిల్లీ రైల్వే స్టేషన్​లో తొక్కిసలాట..
న్యూదిల్లీ రైల్వే స్టేషన్​లో తొక్కిసలాట.. (Hindustan Times)

మహా కుంభమేళా నేపథ్యంలో న్యూదిల్లీ రైల్వే స్టేషన్​లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి ప్రయాగ్​రాజ్​కు వెళ్లే రెండు రైళ్లు ఆలస్యం అవ్వడం, అనంతరం రైల్వే స్టేషన్​లో భారీ రద్దీ నెలకొనడంతో కొద్దిసేపటికే తొక్కిసలాట జరిగింది. న్యుదిల్లీ రైల్వే స్టేషన్​లో జరిగిన ఈ తొక్కిసలాటలో 16మంది ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది గాయపడ్డారు.

న్యూదిల్లీ రైల్వే స్టేషన్​లో తొక్కిసలాట..

రైల్వేశాఖ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. న్యూదిల్లీ రైల్వే స్టేషన్​లో శనివారం రాత్రి 9:30 గంటలకు ప్లాట్​ఫామ్​ నెంబర్​ 14,15 పై ఈ ఘటన జరిగింది. మహా కుంభమేళా కోసం ప్రయాగ్​రాజ్​కు వెళ్లేందుకు ప్యాసింజర్లు రైళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. రద్దీ అంతకంతకూ పెరుగుతూ వచ్చింది.

కొద్దసేపటికే ప్యాసింజర్ల తాకిడి మరింత పెరగడంతో న్యూదిల్లీ రైల్వే స్టేషన్​లో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటతో అనేక మంది స్పృహకోల్పోయి కిందపడిపోయారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 16మంది మరణించగా, వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. అనేకమంది గాయపడ్డారు.

సీట్లు ఉండవేమో అన్న భయంతో భారీ సంఖ్యలో ప్రజలు ఒకేసారి రైళ్లల్లోకి ప్రవేశిస్తున్న దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

ఘటనాస్థలానికి పరుగులు తీసిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. నాలుగు అగ్నిమాపక సిబ్బంది సైతం రైల్వే స్టేషన్​కి చేరుకుని అధికారులకు సాయం చేసింది. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

అయితే, 1500కిపైగా జనరల్​ టికెట్లు విక్రయించడం ఈ రద్దీకి కారణం అని తెలుస్తోంది!

"ప్రయాగ్​రాజ్​ ఎక్స్​ప్రెస్​ ప్లాట్​ఫామ్​ నెం. 14పైకి వచ్చినప్పుడు చాలా మంది ప్యాసింజర్లు ప్లాట్​ఫామ్​పై ఉన్నారు. స్వతంత్రత సేనాని ఎక్స్​ప్రెస్​, భువనేశ్వర్​ రాజధాని ఆలస్యమయ్యాయి. ఈ రైళ్లు ఎక్కాల్సిన ప్యాసింజర్లు ప్లాట్​ఫాం నెం. 12,13,14లో ఉండిపోయారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం 1500కిపైగా జనరల్​ టికెట్లు విక్రయించినట్టు, అందుకే రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయి, నియంత్రించలేని విధంగా మారినట్టు సమాచారం," అని రైల్వే డిప్యూటీ కమిషనర్​ ఆఫ్​ పోలీస్​ కేపీఎస్​ మల్హోత్రా తెలిపారు.

Tags
Chat