Bathukamma Songs - Chandamama Song | ఒక్కేసి పూవ్వేసి చందమామ పాట

P Madhav Kumar


ఒక్కేసి పూవ్వేసి చందమామ

ఒక్క జాములాయె చందమామ

జాముజాముకూ చందమామ

శివుడు రాకాపాయే చందమామ


రెండేసి పూలేసి చందమామ

రెండు జాములాయె చందమామ

జాముజాముకూ చందమామ

శివుడు రాకాపాయే చందమామ


మూడేసి పూలేసి చందమామ

మూడు జాములాయె చందమామ

జాముజాముకూ చందమామ

శివుడు రాకాపాయే చందమామ


నాలుగేసి పూలేసి చందమామ

నాలుగు జాములాయె చందమామ

శివపూజ వేలాయె చందమామ

శివుడు రాకాపాయే చందమామ


ఐదేసి పూలేసి చందమామ

ఐదు జాములాయె చందమామ

శివపూజ వేలాయె చందమామ

శివుడొచ్చి కూర్చునే చందమామ


చందమామ పాట



f