మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చిరుత పులి ఎట్టకేలకు బోనులో చిక్కింది. జిల్లా కేంద్రం సమీపంలోని తిరుమల దేవుని గుట్ట మరియు వీరన్న పేట ప్రాంతంలో రెండున్నర నెలలుగా సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది.
రెండు ,మూడు రోజులకు ఒకసారి బయటకు వచ్చి బండరాళ్ల నిలబడి సేద తీరుతూ ఉండటంతో అది చూసి నివాస ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురి అయ్యేవారు. కొన్ని సందర్భంలో ఇండ్ల సమీపంలోకి రావడంతో ప్రజలు ఆందోళనకు గురైన ఘటనలు ఉన్నాయి. పులి వచ్చినప్పుడే అక్కడి వచ్చి పరిశీలించి చర్యలు చేపడతామని దాట వేసేవారు. డ్రోన్ తో నిఘా పెట్టిన ఫలితం లేకుండా పోయింది. ఎట్టకేలకి అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులోనే చిరుత చిక్కుకుంది. దీంతో జిల్లా కేంద్ర ప్రజలూ ఊపిరి పీల్చుకున్నారు.