కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహా పురుషులవుతారు.
మహబూబ్నగర్ ప్రజాతంత్ర జనవరి 3 : దృఢ సంకల్పంతో అకుంఠిత దీక్ష దక్షత తో కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహా పురుషులవుతారు గౌతమ బుద్ధులు శంకరాచార్యులు లాంటి వారంతా కృషితో మానవాళికి ఎంతో మేలు చేశారు మహాపురుషులయ్యారు ఇంతటి జ్ఞానసిద్ధి ఉన్న జనార్ధన్ గురుస్వామి జీవిత యదార్థ గాధ ఇది మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం కిష్టారం గ్రామం వాస్తవ్యులు పిట్టల రాములమ్మ పిట్టల సాయిలు వ్యవసాయ కుటుంబ పుణ్య దంపతులకు 1966 వ సంవత్సరంలో జన్మించారు ఐదవ సంతానమైన జనార్ధన్ గురుస్వామి చిన్ననాటి నుండి దేవుళ్లపై మక్కువ భక్తి భావంతో పెరిగారు పిన్న వయసులోనే ఆధ్యాత్మికం అంటే ఎంతో ఇష్టం 1989 సంవత్సరంలో పద్మనాభ గురు స్వామి చేతుల మీదుగా అయ్యప్ప మాల ధారణ చేపట్టారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని సింహగిరి ప్రాంతంలో పాల వ్యాపారిగా జీవనం కొనసాగిస్తున్నారు జనార్దన్ గురుస్వామి. జనార్దన్ అనే పేరు హిందూ పురాణాలలో విష్ణువు కు ఇచ్చే పేర్లలో ఒకటి కావున జనార్దన్ అనే పేరు గలవారు విష్ణువు భక్తులుగా ఉండే అవకాశం ఉంది గురు స్వామి అనే బిరుదు సాధారణంగా ఆధ్యాత్మిక గురువులకు ఇస్తారు. కావున జనార్ధన్ గురుస్వామి అనే పేరు వ్యక్తి ఆధ్యాత్మిక పరిజ్ఞానం కలిగి ఉండే అవకాశం ఉందని పురాణాలు చెబుతున్నాయి అలాగే పాల వ్యాపారి అయిన జనార్ధన స్వామి పాలు అంటే శుద్ధి నిష్టకు సంబంధించింది అయ్యప్ప స్వామి కూడా శుద్ధి నిష్టకు ప్రతీక కావున జనార్ధన్ స్వామి తన పాల వ్యాపారాన్ని అయ్యప్పస్వామి సేవగా భావిస్తున్నారు. నాటినుండి నేటి వరకు అయ్యప్ప స్వామి మాల ధారణ దీక్షతో 34సంవత్సరాలుగా శబరీశునుని దర్శించుకుంటు న్నారు. ఇందులో 29 సంవత్సరాలుగా అతి కఠినమైన పెద్ద పాదం యాత్ర చేపట్టారు. వీరికి మాల ధారణ వేసుకున్న మొదటి ఏడాది సమయంలోనే తమిళనాడు రాష్ట్రానికి చెందిన సూర్య ప్రకాష్ గురు స్వామి పరిచయం అయ్యారు గురువు చెప్పారంటే ఎంతటి కఠినమైన పనైనా ఓర్పుతో చేయాలనే సంకల్పంతో చేసేవారు జనార్ధన్ గురుస్వామి అందుకే సూర్య ప్రకాష్ గురు స్వామి బృందంలో వచ్చిన శిష్యులు జనార్ధన్ గురుస్వామి. ఐదు మంది అయ్యప్ప భక్తులతో జనార్దన్ గురుస్వామి జై శబరీష భక్తుబృందం అనే నామంతో స్వచ్ఛందంగా వ్యవస్థాపన చేశారు. నాటి నుండి నేటి వరకు వేల సంఖ్యలో అయ్యప్ప భక్తులను అయ్యప్ప మాల ధారణ వేసి దీక్షలు చేయించి శబరిమల యాత్రకు తీసుకెళ్తున్నారు వేల సంఖ్యలో అయ్యప్ప భక్తులు జనార్ధన్ గురుస్వామి ఆధ్వర్యంలో చేపట్టిన శబరి యాత్ర తో అయ్యప్ప కరుణించి తమ జీవితాలలో వెలుగు నింపి జీవితాలను మార్పు చేశారని సమాజంలో భక్తి భావం పెంచి అందరి హృదయాలలో జనార్దన్ గురుస్వామి చెరగని ముద్ర వేసుకుంటున్నారు ఎంతోమంది అయ్యప్ప భక్తుల కుటుంబ మహిళలు అయ్యప్ప మాలధారణతో తమ ఇంటి యజమానులు యువకులు సన్మార్గంలోకి వచ్చారని అంత గురుస్వామి కృషి తోనే సాధ్యమైందన్నారు సింహగిరి వాడలో జనార్ధన్ రు స్వామి అంటే ఎంతో భక్తి భయం గౌరవం పెరుగుతూనే ఉన్నాయి జనార్ధన్ గురుస్వామి సంస్కృతి సాంప్రదాయాలతో పాటు జీవితంలో నడవడికను నేర్పిస్తున్నారు ఆ అయ్యప్ప స్వామి కృప కటాక్షాలతోని జనార్దన్ గురుస్వామి రూపంలో మాకు ఎంతో మేలు జరుగుతుంది అంటున్నారు జనార్ధన్ గురుస్వామి అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమాల నిర్వహణలో ఒక ఋషి గా మాకు తలపిస్తున్నారు అంటున్నారు జనార్ధన్ గురుస్వామి ఆ వాడలో వెళ్లే మార్గ సమయంలో ఆ ప్రాంత వాసులు జనార్ధన్ గురుస్వామికి ఎంతో వినయంతో భక్తితో తలవంచి నమస్కరిస్తుంటారు. జనార్ధన్ గురుస్వామి అయ్యప్ప స్వామి యొక్క జీవిత చరిత్రను అధ్యయనం చేశారు ఎంతో మంది అయ్యప్ప భక్తులకు మార్గదర్శకుడిగా ఉపదేశకుడిగా గురువు అయ్యారు గత మూడు సంవత్సరాల పైగా రమణ మహర్షి గురు బోధనను తీసుకొని ఏకభుక్తంతో నిత్య బ్రహ్మచారిగా నిత్యం జపం చేస్తూ నిష్టకు ప్రత్యేకంగా నిలుస్తున్నారు భగవంతుడి ప్రేరణ పొందుతున్నారు నిష్టగా ఉండి సమాజానికి మంచి సేవలను అందిస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జై శబరీష భక్తబృందం జనార్దన్ గురుస్వామి అంటేనే ప్రత్యేక గౌరవం ఏర్పడింది ఎంతో నిష్ట నియమనిబంధనలతో అయ్యప్ప స్వామి దీక్షలు చేపడుతారని గురు స్వామి ముందు అందరూ ముక్కున వేలు వేసుకుంటారు. బ్రాహ్మణులు కంటే ఎక్కువగా మంత్రోచ్ఛారణతో పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు.
ఎంతో భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమాలలో గురు స్వామి పూజలు, భజనలు చేయిస్తుంటే ఆ ప్రాంతమంతా భక్తి పారవశ్యంతో నిండు పోతుంది భక్తులకు పూనకం వస్తుంది.
అయ్యప్ప ఆలయం నిర్మాణం చేపట్టడం లక్ష్యం...
జిల్లా కేంద్రంలోని సింహగిరి ప్రాంతంలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ప్రాంగణంలో హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణాన్ని చేపట్టాలని లక్ష్యంతో ఉన్నారు జనార్దన్ గురుస్వామి, ఆలయ నిర్మాణం కోసం ఇటీవల ప్రస్తుత శాసనసభ్యులు యన్నం శ్రీనివాసరెడ్డిని వినతి పత్రాన్ని అందజేసి కోరారు ఆలయ కమిటీ పెద్దలతో జై శబరిస భక్తుబంధ సభ్యులతో ఎన్నో దఫాలుగా ఈ విషయంపై చర్చిస్తూనే ఉన్నారు ఆలయ నిర్మాణం చేపట్టడం తమ లక్ష్యం అంటున్నారు. నిర్మాణానికి ఎంతో దృఢనిశ్చయంతో ఉన్నామని తొందర్లోనే ఆలయ నిర్మాణానికి అంకురార్పణ చేసి తీరుతామని అంటున్నారు.