కరోనా రాకుండా ఏం చేయాలి,మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, మనల్ని మనం కాపాడుకోవడానికి ఏం చేయాలి, ఈసారి సమస్య మరింత తీవ్రంగా మారుతోందా - how to protect yourself from covid-19 during case surge

కరోనా రాకుండా ఏం చేయాలి,మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, మనల్ని మనం కాపాడుకోవడానికి ఏం చేయాలి, ఈసారి సమస్య మరింత తీవ్రంగా మారుతోందా - how to protect yourself from covid-19 during case surge

P Madhav Kumar


మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, మనల్ని మనం కాపాడుకోవడానికి ఏం చేయాలి, ఈసారి సమస్య మరింత తీవ్రంగా మారుతోందా

దగ్గు, తుమ్ములు

దగ్గు, తుమ్ములు వచ్చేటప్పుడు టిష్యూ లేదా, గుడ్డతో ముక్కు, నోటిని కవర్ చేయాలి. లేదంటే వ్యాధి కారక క్రిములు చుట్టు పక్కలా వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి, ఎప్పటికప్పుడు హ్యాండ్ కర్చీఫ్, టిష్యూ మెంటెయిన్ చేయండి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలకి ఇది త్వరగా వ్యాపిస్తుంది. కాబట్టి, వీరిని మరింత జాగ్రత్తగా ఉంచడం మంచిది. దగ్గు ఆగకుండా వస్తే అనుమానించాల్సిందే.​

చేతులు కడుక్కోవడం

​ఎప్పటికప్పుడు చేతులని చక్కగా క్లీన్ చేయాలి. సబ్బు, నీరు, లేదా ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ రబ్ వాడాలి. శానిటైజర్ వాడాలి. బయటికి వెళ్లి రాగానే, ఏవైనా తినే ముందు కచ్చితంగా చేతులు కడుక్కున్నాకే ఏమైనా తినడం, ముట్టడం చేయాలి. బయటికి వెళ్లి రాగానే శానిటైజ్ చేయండి. మీరు, మీకు సంబంధించిన వస్తువుల్ని శానిటైజ్ చేయడం మర్చిపోవద్దు.

జలుబు, ఫ్లూ ఉన్నవారికి దూరంగా

అదే విధంగా, జలుబు, ఫ్లూ వంటి లక్షణాలు ఉన్నవారికి దూరంగా ఉండాలి. వారు తుమ్మినా, దగ్గినా వారి నుంచే వైరస్‌ల కారణంగా సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దూరంగా ఉండడం మంచిది. ముఖ్యంగా శ్వాస సమస్యలు ఉన్నవారికి దూరంగా ఉండడం మంచిది.

మాస్క్ వాడడం

ఎక్కడికెళ్లినా మాస్క్ వాడాలి. ఎవరి దగ్గరికి వెళ్లినా మాస్క్ వాడండి. షేక్ హ్యాండ్స్, హగ్ చేసుకోవడం వంటివి కొన్నిరోజులు చేయకపోవడమే మంచిది. మాస్క్‌లేకుండా ఎక్కడికి వెళ్లకూడదని గుర్తుంచుకోండి. తుమ్ము, దగ్గు వచ్చినప్పుడు పక్కకి తిరగడం మంచిది.

బాగా ఉడికిన ఆహారాన్నే తినడం

ముఖ్యంగా గుడ్లు, మాంసం వంటివాటిని బాగా ఉడికిన తర్వాతే తినాలి. ఇలాంటి వాటి నుంచే వైరస్‌లు త్వరగా వ్యాపిస్తాయి. కాబట్టి, వాటిని ముందు చక్కగా క్లీన్ చేసి ఎక్కువగా ఉడికించాకే తినండి. పచ్చిగా ఉన్నా లేదా సగం ఉడికిన మాంసం, గుడ్లు తినకపోవడమే మంచిది.

పెట్స్‌కి దూరంగా

ఎలాంటి జాగ్రత్తలు లేకుండా పెట్స్, పెంపుడు జంతువులను తాకడం, దగ్గరగా ఉండడం చేయొద్దు. వీటిని కూడా బయటికి పంపకపోవడమే మంచిది. వీటి వల్ల వ్యాధులు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోండి. ఎక్కువగా జనసంచారం ఉన్న ప్రాంతాల్లో కొన్నిరోజులు ఉండకపోవడమే మంచిది.

గమనిక :ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాటించేముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి. 

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!