
ఎలక్టివ్ ఆపరేషన్
73 ఏళ్ల రజనీకాంత్‌కు మంగళవారం (అక్టోబర్ 1) ఎలక్టివ్ ఆపరేషన్ నిర్వహించే అవకాశం ఉందని వైద్యులు తెలిపారట. అయితే, ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే, రజనీకాంత్ ఆస్పత్రిలో చేరడంపై అటు రజినీకాంత్ కుటుంబం నుంచి కానీ, ఇటు ఆసుపత్రి నుంచి కానీ ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.
ఆందోళనలో అభిమానులు
ఇదిలా ఉంటే, రజనీకాంత్ హాస్పిటల్‌లో చేరారు అనే వార్తలు జోరందుకోవడం ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం రజనీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వెట్టయాన్, కూలి వంటి చిత్రాల్లో రజనీకాంత్ నటిస్తున్నారు. ఇటీవలే వెట్టయాన్ టీజర్ విడుదలైంది.
పవర్‌ఫుల్ ఎన్‌కౌంటర్ ఆఫీసర్
అక్టోబర్ 10న వెట్టయాన్ సినిమా రిలీజ్ కానుంది. ఇందులో రజనీకాంత్ పవర్‌ఫుల్ ఎన్‌కౌంటర్ ఆఫీసర్‌గా కనిపించారు. వెట్టయాన్ సినిమాలో విలన్‌గా రానా దగ్గుబాటి నటించగా.. అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.