ఫాదర్స్ డే 2025,Father's Day 2025 : తండ్రి మాత్రమే పిల్లల కోసం చేసే పనులు, అందులో కొన్నైనా మనం ఆయన కోసం చేయగలమా - fathers day 2025 heart warming things only fathers can do for his children

P Madhav Kumar

 

Father's Day 2025 : తండ్రి మాత్రమే పిల్లల కోసం చేసే పనులు, అందులో కొన్నైనా మనం ఆయన కోసం చేయగలమా

మధుమేహ వ్యాధిగ్రస్తులు: మీ రక్తంలో చక్కెరను ఎలా తగ్గించుకోవచ్చో ఇక్కడ ఉంది మూలికా డయాబెటిక్ సంరక్షణ | Sponsored క్లిక్ చేయి

బయటికెళ్తే

​ఇక చిన్నతనంలో ఎక్కడికైనా వెళ్లినప్పుడు మనం చూడలేని ఎన్నో దృశ్యాలను ఆయన భుజాలపై ఎక్కి మరీ ఆనందించే పిల్లలం మనం. అదేంటో పెద్దయ్యాక ఎన్ని కొత్తకొత్త ప్లేస్‌లు తిరిగి, మరెన్నో సుందర దృశ్యాలు చూసినా అప్పటి ఆనందం రాదు. దీనికి కారణం చిన్నతనం కాదు. చిన్నతనంలో ఆయన ఇచ్చిన ఆనందం. నాన్న భుజాలమీద కూర్చుని చూస్తే ప్రపంచానికే రాజు, రాణిలా మారిన ఫీలింగ్ ఇచ్చిన కిక్ ఇప్పుడు ఎన్ని లక్షలు పోసినా మళ్ళీ మనకొస్తుందా.

స్కూల్‌లో చేరగానే

ఇక్క స్కూల్‌లోకి చేరడంతో కమర్షియల్ మార్కెట్‌లోకి అడుగుపెడతాడు నాన్న. ప్రీకేజీ, ఎల్‌కేజీ అంటూ కేజీల కొద్దీ డబ్బు బేరసారాలు ఆడుతున్నా లేదా తన స్థోమతని బట్టి ప్రభుత్వ పాఠశాలలో వేసినా అదనపు ఖర్చులు అదనమేగా. వాటన్నింటి కోసం తన అవసరాలని పక్కనపెట్టి ఇవి తర్వాతైనా కొనుక్కోవచ్చు, ముందు పిల్లల్ని స్కూల్లో తక్కువ చేయొద్దొని ఆలోచించి ఉన్న సొమ్మునంతా ప్రశ్న అడగకుండానే దారపోస్తాడు.

పరీక్షల టైమ్

పరీక్షలు టైమ్‌లో మనపై నాన్న తీసుకున్న శ్రద్ధ.. తన చదువుకున్న టైమ్‌లో తీసుకుంటే మరింత పైస్థాయిలో ఉండేవాడేమో. ఉదయం లేచిన దగ్గర్నుంచీ చదివించడం దగ్గరుండి పిల్లల్ని సెంటర్ దగ్గరికి తీసుకెళ్లి జాగ్రత్తలు చెప్పి పరీక్ష రాయించేవాడు. పరీక్ష 3 గంటలు ఉంటే ఆ టైమ్‌లో ఇంటికెళ్లకుండానే అదే సెంటర్ దగ్గర పడిగాపులు కాసే నాన్నలెందరో. ఆడపిల్లల నాన్నలైతే మరో అడుగు ముందే. ఎక్కడ తన కూతురికి ఏ ఇబ్బంది వస్తుందోనని కంటిమీద కునుకులేకుండా ఉండేవాడు.

ఉద్యోగ వేటలో అండగా

ఇన్ని దాటుకుని వచ్చి ఉద్యోగ వేటలో వెనకపడుతుంటే మనల్ని చూస్తూనే ఏం కాదు, ట్రై చెయ్ ఇంకా బెటర్ ఫ్యూచర్ ఉందని చెప్పడమో, కోపంగా చూడడమో.. ఇలా ఏదో ఒకటి చేసినా మనసులో మాత్రం మనం పడిన బాధకంటే ఆయనకే ఎక్కువ బాధ ఉంటుందని ఎంతమంది కనిపెట్టగలిగారు. ముందుగా చెప్పినట్లు పైకి ఉరిమినట్లుగా చూసినా పైపైకి వచ్చి బెదిరించినా అవి వర్షానికి ముందు వచ్చే మెరుపుల్లాంటివే. లోలోపల ఆయన ప్రేమ ఆకాశమంతా అనంతం. అంతమాత్రాన నాన్నని నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం లేదులే.

ఇన్ని చేసినా ఏ ప్రతిఫలం ఆశించకుండా

అదేంటి మనకి తెలియకుండా నాన్నలు ఇన్ని చేశారనుకుంటే మీరు గంగానంలో కాలుపెట్టినట్టే. ఇంతకుమించి అనంతమైన త్యాగాలు చేశారు. అవన్నీ కూడా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండానే. అయితే, చాలా మంది నాన్నప్రేమని గుర్తించినప్పటికీ, కొంతమంది ఇంకా నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. అలాంటి వారందరూ నాన్న ప్రేమని ఎప్పుడు అర్థం చేసుకుంటారంటే వాళ్లు నాన్న స్థానంలోకి వచ్చినప్పుడు మాత్రమే. ఇన్ని భారాలు మోసిన నాన్న వయసు పెరిగాక కాస్తా గుర్తింపు, మనకోసం ఆయన చేసిన పనుల్లో కొద్దిగానైనా మనవంతుగా చేయడమే ఆయనకిచ్చే గౌరవం. ఇంతకు మించి ఏం అవసరం లేదండి. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే.

Tags
Chat