ganesh chaturthi 2024 : గణపతి భక్తులకు గుడ్‌న్యూస్.. హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనానికి హైకోర్ట్‌ గ్రీన్‌ సిగ్నల్‌

P Madhav Kumar

ganesh chaturthi 2024 : హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనంపై ఇప్పటివరకు గందరగోళం నెలకొంది. కానీ.. ఆ పరిస్థితికి తెలంగాణ హైకోర్టు చెక్ పెట్టింది. హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనానికి హైకోర్ట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీనిపై గణపయ్య భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వినాయక నిమజ్జనం
వినాయక నిమజ్జనం (HT)

హైదరాబాద్‌లోని గణేష్‌ ఉత్సవ కమిటీలకు తెలంగాణ హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనానికి హైకోర్ట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ ఏడాది కూడా హుస్సేన్‌ సాగర్‌లోనే గణపతి విగ్రహాలను నిమజ్జనం చేసుకోవడానికి అనుమతించింది. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటించాలని ప్రభుత్వానికి సూచించింది. నిమజ్జనం చివరి సమయంలో ధిక్కరణ పిటిషన్‌ సరికాదని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

జీహెచ్ఎంసీ బ్యానర్..

హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ దగ్గర మంగళవారం ఉదయం పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు బ్యానర్లు ఏర్పాటు చేశారు. గణేష్‌ నిమజ్జనాలకు అనుమతి లేదంటూ బ్యానర్లు కట్టారు. హైకోర్టు ఆదేశాల మేరకే బ్యానర్లు కట్టామని జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే.. మంగళవారం సాయంత్రం తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

రాజాసింగ్ హాట్ కామెంట్స్..

ట్యాంక్‌బండ్‌లో గణేష్ నిమజ్జనం నిషేధం అంటూ వెలసిన పోస్టర్లపై ఘాటుగా స్పందించారు బీజేపీ నేత రాజాసింగ్. హుస్సేన్ సాగర్‌లో కొత్తగా కలుషితం అయ్యేది ఏముందని ప్రశ్నించారు. ఇప్పటికే అది కలుషిత నీరు అని స్పష్టం చేశారు. ట్యాంక్ బాండ్‌లో వద్దు అంటే.. మరి ఎక్కడ నిమజ్జనం చెయ్యాలో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజాసింగ్ ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటికే నిమజ్జనాన్ని నిషేధించలేం అని హైకోర్టు స్పష్టం చేసింది.

నిమజ్జనం అంటే అక్కడే..

హైదరాబాద్ వాసులకు గణేష్‌ నిమజ్జనం అంటే హుస్సేన్ సాగరే గుర్తుకొస్తుంది. నగరంలో ఖైరతాబాద్ గణపతి నుంచీ.. గల్లీలోని బుల్లి గణపతుల వరకూ.. అన్నింటినీ ట్యాంక్‌బండ్ దగ్గరే ప్రతి ఏటా నిమజ్జనం చేస్తారు. దీంతో అక్కడ సందడి వాతావరణం కనిపిస్తుంది. గణపతి నిమజ్జనాన్ని చూసేందుకు తెలంగాణ ప్రజలే కాకుండా.. ఏపీ, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తారు. ఆ రద్దీకి తగ్గట్టు పోలీసులు ఏర్పాట్లు చేసేవారు. కానీ.. ఈ ఏడాదే కాస్త గందరగోళ పరిస్థితి నెలకొంది. తాజాగా తెలంగాణ హైకోర్టు ఆ గందరగోళానికి బ్రేక్ వేసింది.

HT Telugu ఫేస్‌బుక్ పేజీ ద్వారా అప్‌డేట్స్ పొందండి

Immersion of Ganesh : ట్యాంక్‌బండ్‌లో గణేష్ నిమజ్జనంపై నిషేధం విధించారు. జీహెచ్ఎంసీ, హైదరాబాద్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ఈ ఇష్యూపై ఘాటుగా స్పందించారు బీజేపీ నేత రాజాసింగ్. ఎక్కడ నిమజ్జనం చేయాలో చెప్పాలని డిమాండ్ చేశారు.

వినాయక నిమజ్జనం
వినాయక నిమజ్జనం

ఇప్పటికే కలుషితం కదా..

'వినాయక నిమజ్జనానికి ఇంకా ఆరు రోజులే ఉంది. ఇప్పుడు జీహెచ్ఎంసీ అధికారులు హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం వద్దంటే ఎలా.. హుస్సేన్ సాగర్‌లో నీరు ఇప్పటికే కలుషితంగా ఉంది. మళ్లీ కొత్తగా కలుషితం అయ్యేది ఏంటి. అసలు దీనిపై హైకోర్టులో ఎవరు పిటిషన్ వేశారు. వారిని ఒకసారి హుస్సేన్ సాగర్‌కు రమ్మని చెప్పండి. దాంట్లో గ్లాస్ నీరు తీసుకొని తాగితే.. అవి కలుషితం అయ్యాయా లేదా అనేది తెలుస్తుంది' అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.

ఆదాయం వస్తలేదా..

'హుస్సేన్ సాగర్‌లో వినాయకుడి నిమజ్జనం చేయడం మంచిదే. నిమజ్జనం తర్వాత 20 రోజుల్లో మట్టి కరిగిపోతుంది. నిమజ్జనం తర్వాత రెండు రోజులకే జీహెచ్ఎంసీ సిబ్బంది విగ్రహాలను తొలగిస్తారు. దీని వల్ల ఆదాయం కూడా వస్తుంది. విగ్రహాల స్టీల్ ద్వారా జీహెచ్ఎంసీకి ఆదాయం వస్తుంది కదా. అలాంటప్పుడు నిమజ్జనం ఎందుకు వద్దో చెప్పాలి. అక్కడ వద్దంటే ఎక్కడ చేయాలో ముఖ్యమంత్రి చెప్పాలి' అని రాజాసింగ్ డిమాండ్ చేశారు.

ట్యాంక్‌బండ్ వద్ద బారికేడ్లు..

హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ దగ్గర పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు బ్యానర్లు ఏర్పాటు చేశారు. గణేష్‌ నిమజ్జనాలకు అనుమతి లేదంటూ బ్యానర్లు కట్టారు. హైకోర్టు ఆదేశాల మేరకు బ్యానర్లు కట్టిన పోలీసులు.. హుస్సేన్‌సాగర్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. అయితే.. విచారణ కాకముందే హైదరాబాద్ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు బ్యానర్లు కట్టడం హాట్ టాపిక్‌గా మారింది.

హైకోర్టులో పిటిషన్లు..

ప్రతి సంవత్సరం గణపతి నిమజ్జన కార్యక్రమాలను హుస్సేన్ సాగర్‌లో నిర్వహిస్తారు. అయితే.. హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనం వేడుకలు జరపకూడదని హైకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. వినాయకుడి విగ్రహాల నిమజ్జనంతో.. సాగర్ కాలుష్యం అవుతుందని.. దీని నుంచి చెరువులను, హుస్సేన్ సాగర్‌ను పరిరక్షించాలని పిటిషన్లు దాఖలయ్యాయి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను వేసి.. హుస్సేన్ సాగర్‌ను పూర్తిగా కలుషితం చేస్తున్నారని.. దాన్ని పరిరక్షించాలని హైకోర్టులోఅనేక పిటిషన్లు దాఖలయ్యాయి.

HT Telugu ఫేస్‌బుక్ పేజీ ద్వారా అప్‌డేట్స్ పొందండి

Tags
f