MBNR: జడ్చర్లలో స్వైన్‌ ఫ్లూ కేసు కలకలం

P Madhav Kumar

జడ్చర్లలో స్వైన్‌ ఫ్లూ కేసు కలకలం

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో స్వైన్‌ఫ్లూ కేసు నమోదైంది. స్థానికుడు వారం రోజులుగా జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస ఇబ్బందితో బాధపడుతున్నాడు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నా తగ్గకపోవడంతో స్వైన్‌ఫ్లూ పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. వైద్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. లక్షణాలుంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని, పరిశుభ్రత పాటించాలని, భయపడవద్దని వైద్యులు సూచించారు.
Tags
f