మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి 2 గంటల తర్వాత ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ ఉరుములు, మెరుపుల ధాటికి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వర్షం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్ లేకపోవడంతో ఉక్కపోతతో అల్లాడిపోయారు. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
