
కోల్‌కత్తాలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ సంఘటన ఎంతోమందిని కలచివేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ఇప్పటికీ చాలామంది నిరసన చేస్తున్నారు. తనకు న్యానం చేయాలంటూ అధికారులను కోరుతున్నారు. అయితే ఈ దారుణం గురించి ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీ స్పందించారు. తాజాగా, మంచు మనోజ్ ట్విట్టర్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ‘‘ఒక సమాజంగా మనం కలిగి ఉన్నామని తెలుసుకున్నాక. ఇది నా హృదయాన్ని ముక్కలు చేస్తుంది. మనకు జన్మనిచ్చిన మహిళలను రక్షించడంలో విఫలమయ్యారు.
తెర వెనుక దాక్కుని అసభ్యకరమైన, అనుచితమైన వ్యాఖ్యలను జోక్స్‌గా చెప్పే రాక్షసులను గుర్తించి, శిక్షించడంలో విఫలమైంది. మహిళలకు అండగా నిలిచే పురుషులు విఫలమయ్యారు. సురక్షితమైన స్థలాన్ని సృష్టించడంలో విఫలమయ్యారు. బాధితులు అసభ్యకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలతో కలిసే సంస్కృతిని అనుమతించాము. న్యాయాన్ని నిర్ధారించడంలో విఫలమయ్యారు. ఇప్పుడు మన మానవత్వాన్ని విఫలం చేస్తున్నాము’’ అని రాసుకొచ్చాడు. ప్రజెంట్ మంచు మనోజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన వారు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.
