ఇరాన్‌ దెబ్బకు.. అమెరికా బిలియన్‌ డాలర్ల రీపర్‌ డ్రోన్లు ఢమాల్‌..!

0


ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై జరిపిన యుద్ధంలో అమెరికా (USA)కు భారీగానే నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణల్లో బిలియన్‌ డాలర్ల విలువైన యూఎస్‌కు చెందిన అత్యాధునిక ఎంక్యూ-9 రీపర్‌ డ్రోన్‌ (MQ-9 Reaper drones)లను టెహ్రాన్‌ ధ్వంసం చేసినట్లు సమాచారం. ఈ వివరాలను మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

ఇరాన్‌ (Iran) దాడుల్లో యూఎస్‌ దాదాపు 30 డ్రోన్‌లను కోల్పోయింది. ఇందులో కొన్ని దెబ్బతిన్నవి కాగా.. వాటిని తిరిగి ఉపయోగించుకోలేని పరిస్థితి. ఇవి ఘర్షణకు ముందు పెంటగాన్‌ వద్ద ఉన్న డ్రోన్‌ నిల్వల్లో దాదాపు 20 శాతానికి సమానం. ఇందులో చాలా డ్రోన్‌లను ఇరాన్‌ గాల్లోనే కూల్చివేసింది. మరికొన్ని క్షిపణి దాడుల్లో నేలపై ధ్వంసమయ్యాయి. ఈ ఎంక్యూ-9 రీపర్‌ డ్రోను ఒక్కొక్కటి సుమారు 30 మిలియన్‌ డాలర్ల వరకు ఖర్చవుతోంది. వీటిల్లో అత్యాధునిక కెమెరాలు, సెన్సర్లు ఉంటాయి. ఇరాన్‌తో యుద్ధంలో యూఎస్‌ దళాలు ఈ డ్రోన్‌లను విరివిగా ఉపయోగించాయి. ప్రస్తుతం ఈ రీపర్‌ డ్రోన్‌ల ఉత్పత్తి ఆగిపోవడం యూఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ.
Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f