Telangana Cabinet Decisions: విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం.

0

 విద్యుత్, పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గింపుపైనా ఒక నిర్ణయం తీసుకోనున్నారు.


Telangana Cabinet Decisions: తెలంగాణ క్యాబినెట్ సమావేశమైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మీటింగ్ జరుగుతోంది. ఈ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు శుభవార్త చెప్పింది. జూనియర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం పథకం అమలు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే స్కూల్స్ తో పాటు జూనియర్ కళాశాలల్లోనూ విద్యార్థులకు ఉదయం అల్పాహారం, పాలు అందించాలని క్యాబినెట్ నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇది అమలు కానుంది.

అటు పొదుపు చర్యలు, విద్యుత్ సంస్కరణలపై కీలక చర్చలు జరుపుతోంది మంత్రి మండలి. ఈ మీటింగ్ లో డిస్కంల నష్టాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. జూన్ 2 నుంచి రైతు డిస్కం అమలు చేయాలనే భావనలో ఉంది ప్రభుత్వం. దీనిపైనా చర్చించనున్నారు మంత్రులు. అలాగే విద్యుత్, పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గింపుపైనా ఒక నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఈవీల వినియోగంపై డిసైడ్ అయ్యే అవకాశం ఉంది. పంటల మార్పిడి దిశగా యాక్షన్ ప్లాన్ తయారు చేయనున్నారు. మైనింగ్ అక్రమాలపై సీబీసీఐడీ విచారణకు నిర్ణయం తీసుకోనుంది క్యాబినెట్.

Post a Comment

0Comments

Post a Comment (0)
f