జడ్చర్ల పట్టణంలోని ఓ పెట్రోల్ బంకులో శుక్రవారం ఓ యువకుడు రూ.100 పెట్రోల్ పోసుకుని మిడ్జిల్ వెళ్లగా బైక్ మధ్యలో ఆగిపోయింది. శనివారం మరో వ్యక్తి కూడా అదే బంకులో పెట్రోల్ పోసుకున్న తర్వాత బైక్ మొరాయించింది. అనుమానంతో మెకానిక్ వద్దకు తీసుకెళ్లగా బైకులో నీరు ఉన్నట్లు తేలింది. దీంతో ఇద్దరు ఆశ్చర్యానికి లోనయ్యారు.
