TG: బక్రీద్ పండుగ నేపథ్యంలో హైదరాబాద్‌లో గొర్రెలు, మేకల సంతల్లో డిజిటల్ చెల్లింపుల పేరుతో మోసాలు జరుగుతున్నాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. కేటుగాళ్లు నకిలీ యాప్‌ల ద్వారా చెల్లింపులు జరిగినట్లు స్క్రీన్‌పై చూపించి అమాయక వ్యాపారులను మోసం చేస్తున్నారన్నారు. కంచన్‌బాగ్, రాజేంద్రనగర్ పరిధిలో ఇలాంటి రెండు సంఘటనల్లో రూ. 68 వేలు, రూ. 48 వేల విలువైన జీవాలను మోసగించి తీసుకెళ్లారు. వ్యాపారులు ఆన్లైన్ చెల్లింపుల స్క్రీన్షాట్లను నమ్మకుండా, తమ బ్యాంక్ ఖాతాలో నగదు జమ అయిందో లేదో స్వయంగా నిర్ధారించుకున్న తర్వాతే జీవాలను అప్పగించాలని, వీలైతే నగదు లావాదేవీలకే ప్రాధాన్యత ఇవ్వాలని సీపీ సూచించారు.