రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం రూ.200 ధరతో సరికొత్త 'జియో ఓటీటీ పాస్'ను విడుదల చేసింది. ఈ 28 రోజుల ప్యాక్ ద్వారా 15 ప్రీమియం ఓటీటీ యాప్‌ల సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. ఇందులో యూట్యూబ్ ప్రీమియం, జియోహాట్‌స్టార్ మొబైల్, అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్లతో పాటు సోనీలివ్, జీ5, సన్ నెక్స్ట్ వంటి 12 ఓటీటీల సబ్‌స్క్రిప్షన్ కూడా ఉన్నాయి. దీంతో పాటు జియోటీవీ యాప్ ద్వారా 1,000 కి పైగా లైవ్ టీవీ ఛానళ్లను ఉచితంగా వీక్షించవచ్చు.